English | Telugu
చీటింగ్ కేసులో ప్రముఖ నిర్మాత అరెస్ట్!
Updated : Dec 2, 2023
తాము పెట్టిన పెట్టుబడికి అధిక వడ్డీ వస్తోందంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది. దాన్ని ఆసరాగా చేసుకొని వందలాది మందిని మోసం చేసి డబ్బు దండుకున్న ప్రముఖ నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేశారు. నీది నాది ఒకే కథ, గర్ల్‌ఫ్రెండ్ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన అట్లూరి నారాయణరావును శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ దందా కేసులో నారాయణరావును అరెస్ట్ చేశారు. గతంలో చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్, డీలర్ షిప్‌కి సంబంధించి చాలా మంది నుంచి రూ.530 కోట్లు వసూళ్లు చేశారనే ఆరోపణ ఉంది. ఈ కేసులో ప్రధాన సూత్రదారి గూదే రాంబాబు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కృష్ణంరాజును గత నెలలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
తక్కవ సమయంలో పెట్టిన పెట్టుబడికి ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశ చూపించి ఇండస్ట్రీకి చెందినవారిని, పలు వ్యాపారులను మోసం చేసి కోట్లు వసూళ్లు చేసి తర్వాత బోర్డు తిప్పేయడంతో బాధితులు కంపెనీపై కేసు పెట్టారు. ఈ విషయంలో రాంబాబుని బాధితులు ఒత్తిడి చేయగా ఓ చార్టెట్ అకౌంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలిశాడు రాంబాబు. కేసు లేకుండా చేయడానికి ఖర్చు అవుతుందని చెప్పి రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసారాలు చేసి డీల్ రూ.2 కోట్లకు కుదుర్చుకొని పది లక్షలు అడ్వాన్స్, కోటి విలువైన గోల్డ్ ఆభరణాలు తీసుకున్నాడు. ఆభరణాలను పాతబస్తీలో కరిగించి రూ.90 లక్షలకు అమ్మేశాడు. ఈ క్రమంలోనే ఆయనను ఏపీలో అరెస్ట్ చేశారు.