English | Telugu
‘గోపాల గోపాల’కి అసలు టెస్ట్ మొదలైంది
Updated : Jan 13, 2015
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ చిత్రానికి మొదటి రెండు రోజులు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం రెండు రోజులో ఆంధ్రా, తెలంగాణలో పదమూడు కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ‘గోపాల గోపాల’ కలెక్షన్స్ సోమవారం ఉదయం నుంచి సడన్ గా డ్రాప్ అయినట్లు సమాచారం. చాలా వరకు థియేటర్లు సగానికి పైగా ఖాళీగా వున్నాయట. అయితే బుధవారం నుంచి సంక్రాంతి పండగ ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరతారు కనుక ఆందోళన పడాల్సిన పనిలేదని నిర్మాతలు భావిస్తున్నారట. కానీ శంకర్ ‘ఐ’ బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఈ చిత్రానికి కష్టాలు తప్పవని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని గట్టేక్కించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైనే వుంది. మెసేజ్ ఓరియంటెడ్ కథలతో ఈ ఫీట్ సాధించడం అంత సులభమేం కాదు.