English | Telugu

బ్రహ్మీయిజం (బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్)

హాస్యానికి రూపం ఉంటే ఆయనలాగే ఉంటుందేమో..ఆ ముఖం చూస్తే చాలు,తెలుగువారి ముఖం మీద నవ్వు ఖచ్చితంగా వస్తుంది..ఆయన కామెడీ టైమింగ్ విభిన్నం.ఆయన శైలి ఒక వైవిధ్యం..ఆయనలా నవ్వించడం మరొకరికి అసాధ్యం.దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులకు పొట్టలుచెక్కలు చేస్తున్న ఆ హాస్యానందం పేరు బ్రహ్మానందం..ఈ రోజు ఆయన పుట్టినరోజు..ఈ సందర్భంగా, మన జీవితంలో ఆయన ఇచ్చే విచిత్రమైన హావభావాలు ఎక్కడెక్కడ కనిపిస్తుంటాయో సరదాగా చూద్దామా.

1. వీర భక్తుడు

మనలో చాలా మందికి ఈ ఫ్రెండ్ ఉంటాడు.వీడిది మామూలు భక్తి కాదండోయ్.దేవుడి ఫొటో కనిపిస్తే చాలు, ఫోటో ఊడి కింద పడేదాకా దణ్ణాలు పెడుతూనే ఉంటాడు..పక్కనోళ్లు ఏమనుకుంటారో వీడికనవసరం..బస్సులో వెళ్తున్నప్పుడు ఏ గుడో కనిపించిందంటే, బస్సు సీట్లోంచే మంత్రాలు చదివేస్తూ, పూజలు చేసేస్తాడు. తన భక్తితో, పక్కన ఉన్నోళ్లకు పిచ్చెక్కిస్తాడు. ఆ ఒక్కటీ పక్కన పెడితే, జనరల్ గా ఇలాంటి ఫ్రెండ్స్ పాపం చాలా మంచోళ్లు.


2. అంకుల్ బాబీ..


ఇలాంటి అంకుల్ మన పక్కింట్లోనో ఎదురింట్లోనో ఉంటూనే ఉంటాడు.అమాయకురాలైన భార్యే వీడికి ప్రధాన బలం.ఆమె ఇంట్లో ఉండగానే కథ నడిపించేస్తుంటాడు బాబీ అంకుల్. కానీ చిక్కడు, దొరకడు..

3. పిల్లి పద్మనాభ సింహా

గదిలో పెట్టి కొట్టినప్పుడు పిల్లికి వచ్చే ఫ్రస్టేషన్ కు ఒక షేప్ ఇస్తే, పద్మనాభ సింహా కనిపిస్తాడు..చాలా సంవత్సరాలుగా కుక్కిన పేనులా ఉండే భార్యాబాధితుల్లో ఎక్కువగా ఉంటాడీ క్యారెక్టర్..వాడు బయటికి రాడు..వచ్చాడంటే రచ్చ రచ్చే..


4. దొంగతనం రాని దొంగోడు

వీడికి దొంగతనం రాదు.కానీ చేయడం ఆపడు.దొరుకుతూనే ఉంటాడు.చేస్తూనే ఉంటాడు. ఏదో ఒకరోజు దొరక్కుండా దొంగతనం చేయాలన్నదే వీడి లక్ష్యం..

5. హడావిడి గజాలా


ఈ బ్యాచ్ అంకుల్స్ మనకి డైలీ తగులుతుంటారు.గొడవ జరిగితే మధ్యలో దూరిపోతారు..అక్కడ జరుగుతున్న గొడవతో వీడికి ఏమాత్రం సంబంధం ఉండదు..కానీ హడావిడి చేసేస్తుంటాడు.అవసరమైతే ఇద్దరు ముగ్గుర్ని కొట్టినట్టు బిల్డప్ ఇస్తాడు..అక్కడ వీణ్నెవడూ ఆపకపోయినా, నన్నాపకండి సార్ అన్నది వీడి మెయిన్ డైలాగ్..

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.