English | Telugu

అదీ.. త‌మ‌న్నా బ్రెయిన్‌

ఈమ‌ధ్య క‌థానాయిక‌లు మ‌రీ తెలివిమీరిపోయారు. పారితోషికం విష‌యంలో ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌డం లేదు. నాలుగు డ‌బ్బులొచ్చే అవ‌కాశాల్ని వ‌దులుకోవ‌డం లేదు. త‌మ‌న్నా కూడా త‌న తెలివితేట‌ల్ని బాగానే ప్ర‌ద‌ర్శిస్తోంది. క‌థానాయిక‌గా రాణిస్తూనే, ఐటెమ్ పాట‌ల‌తో అద‌ర‌గొడుతోంది, అల్లుడు శ్రీ‌నులో ఓ ఐటెమ్ పాట కోసం దాదాపు రూ75 ల‌క్ష‌లు అందుకొన్న త‌మ‌న్నా... ఇప్పుడు స్పీడున్నోడు సినిమాకీ అంతే పారితోషికం అందుకొంది. నిజానికి ఈ పాట విష‌యంలోనే త‌మ‌న్నా త‌న తెలివితేట‌ల్ని ప్ర‌ద‌ర్శించింది. అస‌లు విష‌యానికొస్తే...

స్పీడున్నోడు లో త‌మ‌న్నాతో ఐటెమ్ సాంగ్ చేయించాల‌న్న ఆలోచ‌నే లేద‌ట‌. కానీ త‌మన్నా కోస‌మే ఐటెమ్ పాట ఇరికించారు. అదెలాగంటే... బెల్లంకొండ శ్రీ‌నివాస్ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్లో ఓ సినిమా అప్ప‌ట్లో లాంచ్ అయ్యింది. అందులో క‌థానాయిక‌గా త‌మ‌న్నాని ఎంచుకొని అడ్వాన్స్ కూడా చెల్లించారు. అయితే ఆ సినిమా అనుకోని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. త‌మ‌న్నా తీసుకొన్న అడ్వాన్స్ వెన‌క్కి ఇచ్చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక్క‌డే త‌మన్నా తెలివి చూపించింది. 'అడ్వాన్స్ వెన‌క్కి ఇవ్వ‌ను. కావాలంటే.. నాతో మ‌ళ్లీ ఐటెమ్ సాంగ్ చేయించుకోండి ' అంద‌ట‌. అడ్వాన్స్ ఎలాగూ పోతుంది కాబ‌ట్టి.. త‌మన్నాతో ఐటెమ్ పాట అత్య‌వ‌స‌రంగా చేయించాల్సివ‌చ్చింది. అదీ.. త‌మ‌న్నా బ్రెయిన్‌. క‌థానాయిక‌లంతా ఇలానే ఆలోచిస్తే.. నిర్మాత‌లంతా ఏమైపోతారో?

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.