English | Telugu

బాలకృష్ణకి నేడే పద్మభూషణ్..హాజరవుతుంది వీళ్ళే

బాలకృష్ణకి నేడే పద్మభూషణ్..హాజరవుతుంది వీళ్ళే

గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణ(Balakrishna)సుదీర్ఘ కాలం నుంచి కళారంగానికి సేవ చేస్తు వస్తున్నాడు. ఈ కారణంతోనే కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ ని దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌(Padma bhushan)కి  ఎంపిక చేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రకటించడంతో ఎప్పుడెప్పుడు బాలయ్య  ఆ ప్రతిష్టాత్మక అవార్డుని అందుకుంటాడా అని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తు వస్తున్నారు. 

 ఈ నేపథ్యంలో ఈ రోజు బాలయ్య పద్మభూషణ్ ని అందుకోనున్నాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‍లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగనుండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ ని అందుకోనున్నాడు. దీంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్(Nara Lokesh)దంపతులతో  పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు.

పద్నాలుగు సంవత్సరాల వయసులో 1974 లో వచ్చిన 'తాతమ్మకల' అనే చిత్రంతో బాలయ్య సినీ రంగ ప్రవేశం జరిగింది. సుదీర్ఘ కాలంగా  కొనసాగుతు వస్తున్న తన సినీ జర్నీలో బాలయ్య పోషించని పాత్ర  నటించని జోనర్ లేదు. సాంఘిక, ఫ్యాక్షన్, పౌరాణిక, జానపద, చారిత్రాత్మిక ఇలా అన్ని జోనర్స్ లోను నటిస్తు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులని మెప్పిస్తు వస్తున్నాడు. గత జనవరిలో 'డాకు మహారాజ్'(Daku Maharaj)గా వచ్చి హిట్ ని అందుకున్న బాలయ్య ప్రస్తుతం 'అఖండ 2(Akhanda 2)షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరో పక్క రాజకీయాల్లోను రాణిస్తు హ్యాట్రిక్ ఎంఎల్ఏ గా ప్రజాసేవలో ఉన్నారు. తన తల్లి పేరుపై  బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నెలకొల్పి పేదలకి తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తు కూడా వస్తున్నారు.