English | Telugu

త్రీడిలో జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ 

త్రీడిలో జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)స్టార్ హీరోయిన్ శ్రీదేవి(Sridevi)జంటగా నటించిన చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి(Jagadeka Veerudu Athiloka Sundari). సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని వైజయంతి మూవీస్ పై అగ్ర నిర్మాత అశ్వనీదత్(Aswani Dutt)భారీ వ్యయంతో నిర్మించగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendrarao)తెరకెక్కించాడు. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటిని పక్కకి జరిపి సరికొత్త రికార్డులని కూడా నమోదు చేసింది. తుఫాన్ ని సైతం లెక్క చెయ్యకుండా థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్స్ తో రన్ అయ్యాయంటే ఈ మూవీ సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు.

1990 మే 9 న రిలీజైన జగదేకవీరుడు అతిలోకసుందరి వచ్చే నెల మే 9 కి ప్రేక్షకుల ముందుకు వచ్చి 35 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జగదేక వీరుడుని మే 9 న మరోసారి  ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని వైజయంతి సంస్థ అధికారకంగా ప్రకటించింది. అభిమానులు, ప్రేక్షకులకి మరింత థ్రిల్ ని కలిగించేలా అధునాతన టెక్నాలజీతో మెరుగులు దిద్ది 2d వెర్షన్ తో పాటు 3d వెర్షన్ లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

అమ్రిష్ పూరి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం, బేబీ షామిలి, బేబీ షాలిని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా ఇళయరాజా(Ilaiyaraaja)అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. నేటికీ ఆయా పాటలు మారుమోగిపోతూనే ఉంటాయి.

 

త్రీడిలో జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్