English | Telugu

మహాదేవనాయుడుగా నందమూరి బాలకృష్ణ

"మహాదేవనాయుడు"గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా త్రిపాత్రాభినయం చేస్తూండగా, లక్ష్మీ రాయ్, సలోని, ఛార్మి హీరోయిన్లుగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏం పేరు పెడతారాని అంతా ఎదురు చూస్తుండగా, కీర్తి కంబైన్స్ బ్యానర్ మీద "మహాదేవనాయుడు" అనే టైటిల్ ని రిజిస్టర్ చేశారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఆ టైటిల్ ఒక్క నందమూరి బాలకృష్ణకే సరిగ్గా సరిపోతుందనీ, అది ప్రస్తుతం కీర్తి కంబైన్స్ బ్యానర్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో తాతయ్య పాత్ర పేరనీ అంటున్నారు. అంటే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ తాత, కొడుకు, మనవడుగా త్రిపాత్రాభినయంలో నటిస్తున్నారట. తాత "మహాదేవనాయుడు" పాత్ర ఫ్యాక్షనిస్టు అయితే తండ్రి పాత్ర పెద్దమనిషిగా ఉంటాడట. మనవడు పాత్రలో జర్నలిస్ట్ గా నటిస్తున్నాడట. ఈ మూడు పాత్రలూ ఒకదానితో ఒకటి పోటీపడతాయని ఫిలిం నగర్ జనాలంటున్నారు.ఈ సినిమా ఇప్పటివరకూ మూడు పాటల చిత్రీకరణ, అలాగే 30 రోజుల పాటు టాకీ చిత్రీకరణ జరుపుకుందట. ఈ "మహాదేవనాయుడు" చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్‍ 10 వ తేదీన విడుదల చేయ్యాలని నిర్మాత యమ్.యల్.కుమార్ చౌదరి సన్నాహాలు చేస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.