English | Telugu

ముఖ్యమంత్రికి శుభలేఖ ఇచ్చిన యన్ టి ఆర్

ముఖ్యమంత్రికి శుభలేఖ ఇచ్చిన యన్ టి ఆర్ అని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. యంగ్ టైగర్ యన్ టి ఆర్‍ వివాహం ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన నార్నే శ్రీనివాసరావు కుమార్తెతో "మే" 5 వ తేదీన, హైదరాబాద్ హైటెక్స్ లో అత్యంత వైభవంగా జరుగనుంది. తన వివాహానికి రమ్మని పెద్దవారికందరికీ అంటే సినీ రాజకీయ ప్రముఖులందరికీ పెళ్ళి కొడుకు యంగ్ టైగర్ యన్ టి ఆర్ స్వయంగా పెళ్ళి శుభలేఖని అందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

అలా నిన్న అంటే ఏప్రెల్ 21 వ తేదీన, హైదరాబాద్ శ్రీనగర్‍ కాలనీలో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికీ, దిల్ రాజుకీ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికీ తన పెళ్ళి శుభలేఖని స్వయంగా అందించి, వినయంగా ఆహ్వానించినట్లు తెలిసింది. యన్ టి ఆర్ పెళ్ళి శుభలేఖని చూసిన అల్లు అరవింద్ గారి కుటుంబం యన్ టి ఆర్ ని అభినందినట్లు సమాచారం. శుభలేఖలో తన పూర్వీకుల ఫొటోలను పెట్టి, పెళ్ళి కొడుకైన తన ఫొటో పెట్టకపోవటంతో తనవంశం పూర్వీకులు, పెద్దలంటే యన్ టి ఆర్ కి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని వారభిప్రాయపడ్డారట.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.