English | Telugu
సెంటిమెంట్ ఫాలో అవుతున్న అల్లు అర్జున్- బోయపాటి
Updated : Jan 22, 2016
ప్రతీ ఒక్కళ్లకూ సెంటిమెంట్లుంటాయి..సినిమావాళ్లకైతే కాస్త ఎక్కువే ఉంటాయి..ఎన్ని సెంటిమెంట్లు ఫాలో అయినా చివరిగా వాళ్లకు కావాల్సింది భారీ హిట్ కొట్టడమే..లేటెస్ట్ గా అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సరైనోడు మూవీకీ ఇలాంటి సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నట్లు సమాచారం.. సరైనోడును ఇంగ్లీష్ లో ' Sarainodu ' అని రాస్తారు..కానీ మూవీ టీం,ఈ పేరులో ఒక అక్షరం ఎక్కువ పెట్టి ' Sarrainodu ' గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారట..న్యూమరాలజీ ప్రకారం ఇలా మారిస్తే భారీ హిట్ కన్ఫామ్ అని ఎవరో చెప్పడంతో అని ఇలా మార్చారట..
ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ' సరైనోడు ' యాక్షన్ లవ్ స్టోరీగా రాబోతోంది..శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో,బన్నీది ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని సమాచారం.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ' సరైనోడు 'కు నెక్స్ట్ షెడ్యూల్ జనవరి 25 నుంచి మొదలవుతుంది..అల్లుఅర్జున్ కు పెయిర్ గా, రకుల్ ప్రీత్ సింగ్,క్యాథరీన్ ట్రెసా నటిస్తున్నారు..శ్రీకాంత్, ఆది పినిశెట్టి స్పెషల్ రోల్స్ తో పాటు, లోఫర్ హీరోయిన్ దిశా పటానీ,ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడం విశేషం..