English | Telugu
అందాలతో ప్రచారం చేసిన బొద్దు సుందరి
Updated : Jun 20, 2013
బొద్దుగా ఉండే ముద్దు గుమ్మ సోనాక్షికి అందాల ఆరబోత మరీ ఎక్కువ అయిపోతుంది. ఈ అమ్మడు నటించిన అన్నీ చిత్రాలు కూడా విజయం కావడంతో, సినిమాల్లోనే కాకుండా బయట కూడా అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళకు పిచ్చేక్కిస్తుంది.
సోనాక్షి, రణ‌్వీర్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం "లుటెరా". ఈ చిత్ర ప్రమోషన్ కోసం హీరోతో కలిసి వచ్చిన సోనాక్షి... ఒక్కసారిగా అక్కడున్నవారందరికి తన అందంతో మతి పోగొట్టేసింది. బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్సులో వచ్చిన సోనాక్షిని చూసి జనం షేక్ హ్యాండ్ కోసం ఎగబడ్డారు. దాంతో తన అవతారం ఎలా ఉందో తెలుసుకున్న సోనాక్షి, వచ్చిన పని త్వరగా ముగించేసుకొని అక్కడి నుండి జంప్ అయిపొయింది. సినిమా ప్రమోషన్ ఏమో కానీ అభిమానులకు తన బొద్దుగా ఉండే అందాలను చూపించి, చుపించనట్లుగా చేసి వాళ్ళను సినిమాకు వచ్చేలా చేసుకుంది.
మరి ఇది కూడా ప్రమోషన్ లో ఒక భాగమేనా? ఏమో... ఎవరికి తెలుసు?