English | Telugu
దేశం మొత్తం మీద నువ్వే కనపడ్డావు అనంతిక.. అగ్ర నిర్మాత కీలక వ్యాఖ్యలు
Updated : Jun 18, 2025
మ్యాడ్ చిత్రంలో జెన్నీశర్మ అనే క్యారక్టర్ ద్వారా ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి 'అనంతిక సనిల్ కుమార్'(Anathika Sanilkumar). కేరళ కి చెందిన అనంతిక ఈ నెల 20 న '8 వసంతాలు'(8 Vasantalu)అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్రామా అండ్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అనంతిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక రకంగా లేడీ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫణింద్ర నరిశెట్టి(Phanindra Narsetti)దర్శకత్వంలో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్'(Mythri Movie Makers)ఈ చిత్రాన్ని నిర్మించింది. దీంతో ప్రేక్షకుల్లో '8 వసంతాలు' పై మంచి అంచనాలే ఉన్నాయి.
రిలీజ్ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అనంతిక ని ఉద్దేశించి మైత్రి మూవీస్ నిర్మాతల్లో ఒకరైన 'రవిశంకర్' మాట్లాడుతు 8 వసంతాలు మూవీ కోసం అనంతిక చాలా కష్టపడింది. సబ్జెట్ డిమాండ్ ప్రకారం క్లాసికల్ డాన్స్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి కోసం దేశం మొత్తం వెతికితే అనంతిక మాత్రమే కనపడింది. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ పూర్తయ్యాక, ప్లస్ టూ పరీక్షలు రాసింది. ఆ తర్వాత కేరళ నుంచి తిరిగొచ్చాక షూటింగ్ లో పాల్గొంది. ఒక అమ్మాయి ఎనిమిదేళ్ల జీవితాన్ని ఆవిష్కరించే కథే మా చిత్రమని చెప్పుకొచ్చాడు.
అనంతిక కూడా మాట్లాడుతు చిన్నప్పట్నుంచి డాన్స్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. నటిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. 8 వసంతాలు చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి, సంజన హ్రదగేరి కీలక పాత్రలు పోషించారు. లాల్ సలాం,రైడ్ వంటి పలు తమిళ చిత్రాల్లో కూడా ప్రాధాన్యత గల పాత్రలని పోషించింది.