English | Telugu
ప్రముఖ సినీ నటిపై కత్తి దాడి!..ఇందుకే చేసారా!
Updated : Jun 17, 2025
ఆది, నువ్వునేను, సింహాద్రి, విష్ణు, సలీం, ప్రేమంటే మాదే, కోరుకున్న ప్రియుడు వంటి పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులకి దగ్గరైన నటి రమ్యశ్రీ(Ramya Sri)విశాఖపట్నం కి చెందిన రమ్యశ్రీ తన కెరీర్లో ఎక్కువగా వ్యాంప్ తరహా క్యారెక్టర్స్ ని పోషించి, ఆ తరహా క్యారెక్టర్స్ ని పోషించడంలో తనకి తిరుగులేదని అనిపించింది. 2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఓ మల్లి' తో పాటు మరి కొన్ని చిత్రాలకి దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరించింది.
రమ్యశ్రీ కి హైదరాబాద్(Hyderabad)లోని గచ్చిబౌలి(Gachibowli)పరిధిలో ఉన్న 'ఎఫ్ సి ఏ'(FCA)కాలనీలో ఫ్లాట్ ఉంది. రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ ఆద్వర్యంలోని 'హైడ్రా'(Hydra)కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్ఫింగ్ చేపట్టింది. దీంతో ఫ్లాట్ ఓనర్ రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ జరుగుతున్న విషయాన్నీ వీడియో తీస్తున్నారు. దీంతో కొంత మంది దుండగులు రమ్యశ్రీ, ఆమె సోదరుడుపై కత్తి, బ్యాట్ తో దాడికి దిగడంతో, గాయాల బారిన పడిన రమ్యశ్రీ తన సోదరుడితో కలిసి గచ్ఛిబౌలి పోలీసులకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై రమ్యశ్రీ మాట్లాడుతు పట్టపగలు పోలీస్ స్టేషన్ ఎదురుగానే, సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర రావు తన అనుచరులతో కలిసి మా పై హత్యా ప్రయత్నం చేసాడు. హైడ్రా ఆఫీసర్స్ పిలిస్తేనే వచ్చాను. నా ప్లాట్ నెంబర్ 144 . 25 సంవత్సరాల క్రితం కొనుక్కొని ఒక బిడ్డలా చూసుకుంటున్నాను. ప్రభుత్వం ఈ విషయంలో కల్పించుకొని శ్రీధర్ రావు ఆగడాలకి అడ్డు కట్ట వేయాలని విజ్ఞప్తి చేసింది.
రమ్యశ్రీ తన కెరీర్ మొత్తంలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ, భోజ్ పురి భాషలలో కలుపుకొని సుమారు నాలుగువందల చిత్రాల దాకా నటించింది. కన్నడలో హీరోయిన్ గా దాదాపు ముప్పై చిత్రాల దాకా చేసి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.