English | Telugu
అల్లు అర్జున్ తన కొత్త ఓటుని పవన్ కళ్యాణ్ తరుపు మనిషికి వేస్తాడా!
Updated : Aug 2, 2024
ప్రతి పది మంది సినీ అభిమానుల్లో ఖచ్చితంగా అల్లు అర్జున్(allu arjun)ఫ్యాన్ ఒకతను ఉంటాడు. అంతటి క్రేజ్ ని బన్నీ ఓవర్ నైట్ సంపాదించలేదు. గంగోత్రి నుంచి మొన్న పుష్ప(pushpa) దాకా తనదైన యాక్టింగ్, డాన్స్ ,ఫైట్స్ తో అంతటి క్రేజ్ ని సంపాదించాడు. అన్నట్టు పుష్ప అంటే గుర్తొచ్చింది. కొన్ని రోజుల నుంచి పుష్ప 2 తర్వాత బన్నీ చెయ్యబోయే మూవీ ఏంటా అనే చర్చ అందరిలోను మొదలయ్యింది. సోషల్ మీడియాలోను అందుకు సంబంధించిన వార్తలు నిత్యం వస్తునే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలతో ఇక ఆ చర్చలు అధికార చర్చలు కానున్నాయి.
బన్నీ అప్ కమింగ్ పుష్ప 2 (pushpa 2)షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6 కి వాయిదాపడటంతో ఆ డేట్ మారకూడదని రేయింపగుళ్ళు కృషి చేస్తున్నారు. ఇక ఆ మూవీ తర్వాత త్రివిక్రమ్(trivikram)అండ్ అట్లీ(atlee) తో బన్నీ ఫిక్స్ అయ్యాడు. అదేంటి ఎవరితో సినిమా చేస్తున్నాడు అని చెప్పకుండా మళ్ళీ ఆ ఇద్దరిలో ఒకరని అంటారేంటి అని మీరు అనుకోవచ్చు.కానీ ఏం చేస్తాం ఇద్దరు బన్నీ కోసం కాచుకొని కూర్చున్నారు.కానీ ఒక్కటి మాత్రం పక్కా. ఆరు నూరైనా సరే బన్నీ ఆ ఇద్దరిలో ఒకరికి సినిమా చెయ్యబోతున్నాడు. ఈ మేరకు అల్లు అర్జున్ సొంత కాంపౌండ్ నుంచే ప్రకటన వచ్చింది.ఇంకో విషయం ఏంటంటే రెండు సినిమాలు వరుసగా ఉంటాయి. కాకపోతే ఏది ముందు ఉంటుందో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
ఏది ఏమైనా ఎవరి మూవీ ముందు తెరకెక్కినా కూడా అది సంచలనం సృష్టించడం ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ త్రివిక్రమ్, బన్నీ కాంబో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం తో హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఆ ఇద్దరి కాంబో పై అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రాజా రాణి, తేరి, మెర్సిల్, బిగిల్, లేటెస్ట్ గా వచ్చిన జవాన్ తో భారీ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు అట్లీ.. దీంతో బన్నీ, అట్లీ కాంబో పై ఇండియన్ సినీ ప్రేమికుల్లో ఫుల్ క్రేజ్ ఉంది.అట్లీ ట్రాక్ రికార్డుని బట్టి అసలు ఎలాంటి కథ ఎంచుకున్నారనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. మరి బన్నీ ఓటు ఈ ఇద్దరిలో ఎవరకి వేస్తాడో చూడాలి. ఇప్పుడు ఈ విషయంతో సోషల్ మీడియాలో చాలా మంది త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మనిషి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో!