English | Telugu

మేము అడవి జాతి మనుషులం కదా!  ఏమి అనుకోకండి  

ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒక్కో హీరోది ఒక్కో తీరు. కొన్ని సార్లు వాళ్ళకి తెలియకుండానే ఏదైనా వివాదాస్పద మాటని తూలతారు. కొంత మంది తూలకపోయినా ఏదో ఒక రకంగా వైరల్ గా మారుతుంది. కానీ ఆ రెండిటికి అతీతుడు తమిళ అగ్రనటుల్లో ఒకడైన సూర్య(suriya)రెండు దశాబ్దాల క్రితం నుంచే తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో కూడా .ప్రెజంట్ కంగువా(kanuguva)అనే మూవీతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ మూవీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కంగువాని సూర్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాడు. మొట్టమొదటి సారిగా ఏడూ పాత్రల్లో కనపడబోతున్నాడు. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే టీజర్ అండ్ సూర్య గెటప్ కూడా అదిరిపోయాయి. జ్ఞానవేల్ రాజా(jnanavel raja)తో కలిసి యూవీ క్రియేషన్స్(uv creations)అధినేతలైన వంశీ ప్రమోద్ లు 350 కోట్ల భారీ బడ్జట్ తో తెరకెక్కిస్తున్నారు.ఇక అసలు విషయానికి వస్తే కంగువా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.ఈ విషయాన్నీ టీం ఎప్పుడో ప్రకటించింది.అసలు ఒకమాములు సినిమానే రెండు భాగాలుగా విడుదల అవుతున్న సినీ రోజులు ఇవి. అలాంటిది ఫాంటసీ యాక్షన్ మూవీ కంగువా రెండు భాగాలుగా రావడంలో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది.కాకపోతే పార్ట్ 2 విషయంలో ఇప్పుడు నిర్మాతలు చేస్తున్న నయా కామెంట్స్ వైరల్ గా మారాయి. కంగువా పార్ట్ 2 కి అయితే ఎవరూ క్లాష్ కి వచ్చే సాహసం చెయ్యలేరని చెప్తున్నారు. అంటే పార్ట్ 2 కి పోటీగా ఏ సినిమా కూడా రిలీజ్ అయ్యే సాహసం చెయ్యదని వాళ్ళ కాన్ఫిడెన్స్.


ఇంకా మొదటి పార్ట్ విడుదలే కాలేదు. అలాంటిది పార్ట్ 2 ముందు ఎవరు నిలవలేరు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 10 వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న కంగువా లో దిశాపటాని, బాబీ డియోల్,జగపతి బాబు,నటరాజ సుబ్రమణ్యం, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శివ (siva)దర్శకుడు. సూర్య ఒక అటవీ జాతికి సంబంధించిన నాయకుడుగా కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్(devisriprasad)సంగీత దర్శకుడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.