English | Telugu
సంచలనం... 5 యూట్యూబ్ ఛానల్స్‌ను బ్యాన్ చేసిన ‘మా’!
Updated : Jul 13, 2024
ఇటీవలికాలంలో కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ టాలీవుడ్‌లోని నటీనటులను వ్యక్తిగతంగా కించపరడమే కాకుండా, వారి కుటుంబాలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణించింది. వారి మనోభావాలను దెబ్బతీస్తూ అవమానించిందుకు ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఆరంభం మాత్రమేనని, ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే యూ ట్యూబ్ ఛానల్స్‌పై కూడా చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో తెలియజేసింది.
సోషల్ మీడియా బాగా విస్తరించిన నేపథ్యంలో పోటీ పెరిగింది. వారి వారి యూ ట్యూబ్ ఛానల్స్‌కి వ్యూస్ ఎక్కువ రావాలన్న ఆలోచనతో కొందరు సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితాలను సైతం సోషల్ మీడియాలోకి తీసుకు రావడం ద్వారా వారిని మానసిక వేదనకు గురి చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సంస్కృతి బాగా ఎక్కువైందనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ ఐదు ఛానల్స్‌ను టెర్మినేట్ చేసింది.