English | Telugu
ఎర్రబస్సు స్పీడు ఎంత?
Updated : Nov 13, 2014
ఎర్రబస్సు దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి లేటెస్ట్ సినిమా. విష్ణు హీరోగా దాసరి నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘ఎర్రబస్సు’ విడుదలకు సిద్ధమయ్యింది. తమిళంలో విజయవంతమైన ‘మంజ పయ్’ చిత్రానికి రీమేక్ ఇది. శుక్రవారం విడుదలవుతోన్న ఈ చిత్రానికి పబ్లిసిటీ ఘనంగానే చేస్తున్నారు. ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నా సినిమాపై నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేస్తున్నానని దాసరి చెబుతున్నారు. తాత, మనవడి మధ్య అనుబంధాలు, ఆప్యాయతల్ని సినిమాలో అద్భుతంగా చూపించామంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ సినిమాలు తీయలేక ఇబ్బంది పడుతోన్న దాసరి 'ఎర్రబస్సు' తో సడన్ గా ఫామ్ లోకి వస్తారా? వస్తే దాసరి ఎర్రబస్సు స్పీడ్ ఏ స్థాయిలో వుంటుంది? తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.