English | Telugu

"రామ్ చరణ్ లవ్ మ్యారేజే" - చిరంజీవి

తన కుమారుడు రామ్ చరణ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడని, తనకు కోడలని వెతికే అవకాశం చరణ్ ఇవ్వడని మెగాస్టార్ ‍, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి అన్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మ్యారేజ్ రిసెప్షన్ కి హాజరైన అశేష అభిమానుల అడిగి మీదట మెగాస్టార్ చిరంజీవి పై విధంగా స్పందించారు. దానికన్నా ముందు రామ్ చరణ్ ని "మీ పెళ్ళెప్పుడు...? మీది ప్రేమ వివాహమా...? పెద్దలు కుదిర్చే వివాహమా...?" అని అభిమానులు అడిగారు. దానికి బదులుగా రామ్ చరణ్ "నాన్న గారు ఎవరిని చేసుకోమంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. అంటే పెద్దలు కుదిర్చే సంబంధమే చేసుకుంటాను" అని నవ్వుతూ అన్నాడు.

దానికి కౌంటర్ గా చిరంజీవి సమాధానం ఇస్తూ "చరణ్‍ నేను సంబంధం చూసి చేసే దాకా ఆగుతాడని నేననుకోను. తనకు నచ్చిన అమ్మాయిని ఎంచక్కా ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. అంతే కాదు నాకు కోడలిని వెతుక్కునే శ్రమ కూడా తగ్గిస్తాడు" అని అభిమానుల హర్షధ్వానాల, కేరింతల మధ్య అన్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మ్యారేజ్ రిసెప్షన్ లో రామ్ చరణ్ లవ్ మ్యారేజ్‍ చేసుకుంటాడని చిరంజీవి అనటం ప్రత్యేకతను సంతరించుకుంది. మెగాస్టార్ అభిమానులంతా ఈ లవ్ మ్యారేజ్‍ విషయం గురించే చర్చించుకోవటం కనిపించింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం