English | Telugu
నాగ్ చిత్రంలో అల్లరోడు!
Updated : Sep 8, 2023
టాలీవుడ్ మన్మథుడు.. కింగ్ నాగార్జున తన నెక్ట్స్ మూవీగా ‘నాసామి రంగ’ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ అందించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న విజయ్ బిన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. బెజవాడ ప్రసన్నకుమార్ ఈ చిత్రానికి కథను అందిస్తుండటం విశేషం. నిజానికి ఈ మూవీకి ప్రసన్నకుమార్ దర్శకత్వం వహిస్తారనే టాక్ గట్టిగా వినిపించినప్పటికీ..చివరకు విజయ్ బిన్ని సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌లోలుక్, టేకింగ్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆసక్తికరమైన విషయమేమంటే డైరెక్టర్ కరుణకుమార్ ఇందులో విలన్‌గా కనిపిస్తున్నారు.
కాగా.. ఇప్పుడు మరో స్టార్ కూడా ఈ సినిమాలో జాయిన్ అవబోతున్నారనేది సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు.. నేటి తరం కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాల్లోనే నటించటం లేదు. నాంది, ఉగ్రం వంటి సీరియస్ సినిమాల్లో నటించారు. మహేష్ హీరోగా నటించిన మహర్షిలో ఆయన స్నేహితుడు క్యారెక్టర్‌లో మెప్పించారు. ఇప్పుడు నాగార్జున మూవీలో అలరించబోతున్నారు.
నాగార్జునకు ఘోస్ట్ మంచి హిట్ మూవీగా మారుతుందనుకుంటే అది నిరాశ పరిచింది. దీంతో ఆయన కాస్త గ్యాప్ తీసుకుని ఒకేసారి రెండు సినిమాలను ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నారు. నాసామి రంగతో పాటు ధనుష్ మూవీలోనూ ఆయన నటించబోతున్నారు. మరో వైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హోస్ట్‌గానూ వ్యవహరిస్తున్నారు.