English | Telugu
టైగర్ టైగర్.. ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి బిగ్ అప్డేట్..!
Updated : Jun 19, 2025
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం డ్రాగన్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ.. వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా డ్రాగన్ మూవీ షూటింగ్ లో రుక్మిణి వసంత్ జాయిన్ అయింది.
డ్రాగన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. తాను మూవీ షూట్ లో జాయిన్ అయ్యాయని తెలిపేలా తాజాగా రుక్మిణి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. "టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్" అంటూ మేకప్ రూమ్ దిగిన ఫోటోలను పంచుకుంది. ఆమె ధరించిన డ్రెస్ మీద కూడా టైగర్ బొమ్మలు ఉండటం విశేషం.
ఎన్టీఆర్ ను అభిమానులు టైగర్ అని ముద్దుగా పిలుస్తారనే విషయం తెలిసిందే. అందుకే టైగర్ అంటూ షూట్ లొకేషన్ లో దిగిన ఫోటోలను రుక్మిణి షేర్ చేయడంతో.. ఆమె డ్రాగన్ షూటింగ్ లో పాల్గొందని అర్థమవుతోంది.