English | Telugu
కుబేర టికెట్ రేట్స్ పెంపు
Updated : Jun 19, 2025
అక్కినేని నాగార్జున(Nagarjuna)ధనుష్(Dhanush)కాంబోలో శేఖర్ కమ్ముల(Sekhar kammula)దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'కుబేర'(Kuberaa). రేపు వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ తో మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను అంచనాలు పెరిగాయి. రష్మిక(Rashmika Mandanna)హీరోయిన్ గా చేస్తుండగా జిమ్ సర్బ్, దిలీప్ తాలి, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా నిర్మించారు.
ఇక ఈ మూవీ టికెట్ రేట్స్ ని పది రోజులు పాటు పెంచుకునేలా ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఉత్తర్వుల ప్రకారం మల్టి ప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ రేట్ కి జి ఎస్ టి కాకుండా 75 రూపాయలు పెరగనున్నాయి. తెలంగాణాలో మాత్రం టికెట్ రేట్స్ యధావిధిగా కొనసాగన్నాయి. ఇక 'కుబేర' సక్సెస్ పై చిత్ర బృందం చాలా నమ్మకంతో ఉంది. రీసెంట్ గా శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు కుబేర ఒక సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకి చూపించబోతుంది. ఇలాంటి కథ కూడా ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చాడు.
