English | Telugu

ప్రభాస్ వస్తాడా.. ఏం చేయబోతున్నాడు..?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన మూవీ 'కన్నప్ప' (Kannappa). మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదల కానున్న 'కన్నప్ప'పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొంటాడా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

'కన్నప్ప' అనేది భారీ బడ్జెట్ మూవీ. అందుకే ఇందులో వివిధ భాషల స్టార్స్ ని భాగం చేశారు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ ప్రభాస్ స్టార్డంపై ఆధారపడి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాని ఓన్ చేసుకుంటే.. అదిరిపోయే వసూళ్ళు రాబడుతుంది అనడంలో సందేహం లేదు. అయితే అభిమానులు 'కన్నప్ప'ను తమ సినిమా అనుకోవాలంటే.. ప్రభాస్ ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ లో అయినా కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో కన్నప్ప ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఈవెంట్ లు నిర్వహించారు. జూన్ 21 (శనివారం) సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్ హాజరవుతాడా లేదా? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మోహన్ బాబు, విష్ణు ఇప్పటికే ప్రత్యేకంగా ప్రభాస్ ను అహ్వాహించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఈవెంట్ కి వస్తే ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా రెట్టింపు అవుతుంది అనడంలో డౌట్ లేదు. మరి ప్రభాస్ వస్తాడా లేదా? అనేది చూడాలి.

మోహన్ బాబు, విష్ణుతో ప్రభాస్ కి మంచి అనుబంధముంది. అందుకే పాన్ ఇండియా స్టార్ గా ఓ వైపు తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నా.. కేవలం వాళ్ళతో ఉన్న బాండింగ్ తో కన్నప్ప చేయడానికి ఒప్పుకున్నాడు. అదే బాటలో ఇప్పుడు కన్నప్పను తన ఫ్యాన్స్ కి, ప్రేక్షకులను మరింత చేరువ చేయడం కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడేమో చూద్దాం.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.