English | Telugu

దంగల్ మూవీని అమీర్ ఖాన్ పాకిస్థాన్ లో ఎందుకు విడుదల చెయ్యలేదు

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై 'అమీర్ ఖాన్'(Aamir Khan)కట్ అవుట్ కి ఉన్న చరిష్మా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 1973 లో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అమీర్, ఆ తర్వాత కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు. 1984 లో 'హోలీ' అనే మూవీతో హీరోగా పరిచయమయ్యి, నేటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించాడు. అలాంటి వాటిల్లో 'దంగల్'(Dangal)ఒకటి.

రీసెంట్ గా అమీర్ ఒక ఇంటర్వ్యూలో 'దంగల్' గురించి మాట్లాడుతు పాకిస్థాన్ లో 'దంగల్' విడుదల కావాలంటే మన జాతీయ గీతాన్ని, జాతీయ జెండాని తొలిగించాలని పాకిస్థాన్ సెన్సార్ బోర్డు సూచించింది. వాళ్ళు ఆ విధంగా చెప్పిన సెకను లోపే పాకిస్థాన్ లో మా సినిమా విడుదల కాదని, భారత్ కి వ్యతిరేకంగా ఉన్న దేనికి మద్దతు ఇవ్వనని చెప్పాను. దాంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుందని మా నిర్మాతలు చెప్పారు. కానీ నేను లెక్క చెయ్యలేదని అమీర్ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్స్ అమీర్ దేశ భక్తిని మెచ్చుకుంటు ట్వీట్స్ చేస్తున్నారు.

దంగల్ మూవీ 2016 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దార్ధ్ రాయ్ కపూర్, కిరణ్ రావుతో కలిసి అమీర్ నే నిర్మించగా నితీష్ తివారి దర్శకత్వం వహించాడు. హర్యానా రాష్టానికి చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ ఫోగట్, అతని ఇద్దరి కూతుళ్లు కుస్తీ పోటీల్లో ఇండియాకి గోల్డ్ మెడల్ ని అందించడానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డారో ఈ చిత్రంలో చూపించారు. మహా వీర్ సింగ్ పొగట్ గా అమీర్ అత్యద్భుతంగా నటించాడు. భారతదేశంతో పాటు జాతీయ జెండా గొప్పతనం మూవీలో అడుగడుగునా కనపడుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు భారతీయ చలన చిత్ర చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రం దంగల్ నే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .