English | Telugu

గుండుతో సిద్ధార్థ న్యూ లుక్


మొదటి చిత్రం బాయ్స్ నుంచి లవర్ బాయ్‌ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ కొత్త గెటప్‌లో కనిపిచ్చాడు ఈ మధ్య. నువ్వొస్తానంటే నేనొద్దాంటానాలో ఎన్నారైగా, వత్తైన జుట్టేసుకుని గెంతిన సంతోష్ పాత్రలో కనిపించిన సిద్ధార్థని ఎవరూ మరిచిపోరు. కానీ సడెన్‌గా సిద్ధార్థని చూస్తే ఇతనెవరబ్బా అనిపిస్తుంది. ఈ హీరో కొత్త లుక్ చూసిన వాళ్లంత ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కుర్ర హీరోలు ఎవరూ ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి సర్‌ప్రైజ్ చేయలేదు.

సిద్దార్థ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం జిగర్దండ విజయం కోసం తిరుమలలో స్వామి వారిని దర్శించుకుని, తల నీలాలు అర్పించి ఇలా గుండుతో కనిపించాడు సిద్ధార్థ. శివాజీ సినిమాలో రజనీకాంత్ గుండు బాస్ గెటప్ చాలా పాపులర్ అయింది. తన చిత్ర విజయం కోసం సిద్ధార్థ చేయించుకున్న ఈ గుండుతో సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. బొమ్మరిల్లు సినిమా తర్వాత సిద్ధార్థ పెద్ద విజయాలను చవిచూడలేదు. పిజ్జా ఫేం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న జిగర్దండ చిత్రంలో లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా వుంచితే, రోజురోజుకీ కొత్త స్టైల్స్‌తో తమిళ, తెలుగు హీరోలు అభిమానులను ఆకొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తనది సహజమైన తీరు అని నిరూపించడానికి సిద్ధార్థ ఇలా కనిపించాడేమోనని అనుకుంటున్నారు ఈ గెటప్ చూసిన కొందరు.




అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.