English | Telugu

'ఆగడు' లో సూపర్ స్టార్ పంచ్ లు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజున ఆయన నటించే లేటెస్ట్ సినిమా టీజర్‌ని రిలీజ్ చేసి అభిమానులను అలరించుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అదే విధంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' మూవీ రెండో టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌ లో మహేష్ తన ట్రేడ్ మార్క్ డైలాగులతో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. డిక్కీ బలసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తోడ కొట్టిందంట..అనే డైలాగ్ టీజర్‌ కి హైలైట్ గా నిలిచింది. ఈ టీజర్ ని మీరు కూడా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి!