English | Telugu
మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!
Updated : Aug 9, 2014
కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం మొదటి సీజన్ ముగింపు ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ఆ షో లో 150వ చిత్రం గురించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ 150వ చిత్రం ఎప్పుడు రాబోతుందంటూ చిరంజీవిని నాగ్ ప్రశ్నించగా... ఈ సంవత్సరం మొదలు కానుందని, వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కథలు వింటున్నానని, మనస్సుకు నచ్చే కథ దొరికిన వెంటనే సినిమా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు చిరు వెల్లడించారు. దీంతో చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు రిలీఫ్ దొరికింది.