English | Telugu

హ్యాపీ బర్త్ డే 'సాయికిరణ్ అడివి'

'వినాయకుడు' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ అడివి తన జన్మదినోత్సవాన్ని ఆగస్ట్ 11న జరుపుకుంటున్నారు. తన తొలి సినిమా 'వినాయకుడు'తోనే మంచి అభిరుచి గల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ఆయన, ఆ తరువాత విలేజ్ లో వినాయకుడు సినిమా తీసి వరుస విజయాలను దక్కించుకున్నాడు. మొదటి రెండు సినిమాలకు రెండు నంది అవార్డులను గెలుచుకున్న ఈ టాలెంటేడ్ డైరెక్టర్...ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌-లక్ష్మణ్ లు నిర్మిస్తోన్న 'కేరింత' సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా తెరకెక్కుతోంది. సెప్టెంబర్‌లో సినిమాను కంప్లీట్‌ చేసి అక్టోబర్‌లో కేరింత ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. సాయికిరణ్ అడివి కేరింతతో అందరి అంచనాలు అందుకుని మంచి సూపర్ హిట్ అందిస్తాడని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పేద్దాం.