English | Telugu
8 వసంతాలు మూవీలో కబేళా సీన్ కి రావణుడికి సంబంధం ఏంటి?
Updated : Jun 24, 2025
అగ్ర నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్' నిర్మాణ సారధ్యంలో రీసెంట్ గా ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ '8 వసంతాలు'(8 Vasantalu).మనం కోరుకున్న ప్రేమ మన చుట్టూనే తిరుగుతుంటుంది, కాకపోతే దాన్ని గుర్తించడానికి 8 వసంతాల సమయం పడుతుందనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. మలయాళ హీరోయిన్ 'అనంతిక సనిల్ కుమార్'(Ananthika Sanil kumar)టైటిల్ రోల్ పోషించగా రవి దుగ్గిరాల, హనురెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించారు. 'మను' మూవీతో విభిన్న దర్శకుడిగా గుర్తింపు పొందిన 'ఫణింద్ర నర్శెట్టి'(Phanindra Narisetty) దర్శకుడిగా వ్యవహరించాడు.
రీసెంట్ గా చిత్ర బృందం సక్సెస్ మీట్ ని నిర్వహించగా దర్శకుడు తప్ప నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందంతో ఒక విలేకరి మాట్లాడుతు 'కాశీ లాంటి పవిత్ర క్షేత్రంలో ఒక కబేళా లో ఫైట్ , రేప్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. బ్రాహ్మణ, ముస్లిమ్ వర్గాల వారిని సదరు సీన్ లో చూపించారనే ప్రశ్నని సంధించడం జరిగింది. ఈ విషయంపై దర్శకుడు 'ఫణింద్ర' ఇనిస్టా వేదికగా స్పందిస్తు 'బ్రాహ్మణ వర్గం పట్ల నాకెప్పుడు అమితమైన గౌరవం ఉంది. వారి నాలుకపై సరస్వతి దేవి ఉంటడంతో పాటు, సనాతన ధర్మానికి, వేదవిద్యకిఅమితంగా కృషి చేస్తారు. నేరాలు చేసే వాళ్ళకి కులం, మతం ఉండదు.ప్రవర్తన, ఆలోచన ధోరణి ని బట్టే నేరం చేస్తాడు.
రావణుడు సకల విద్యలు తెలిసిన గొప్ప బ్రాహ్మణ కుమారుడు. ఎప్పుడు నుదిటిపై విభూది ధారణ, మెడలో శివ మాల ధరించే గొప్ప శివ భక్తుడు. మరి అలాంటి వ్యక్తి చివరకి ఏం చేసాడు. కబేళా అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడైనా ఉండవచ్చు. ఒక వర్గంపైనే ముద్ర వేస్తు మీడియా సమావేశంలో అత్యాచారం గురించి ఎందుకు మాట్లాడారో అర్ధం కావటం లేదు. 'యద్భావం తద్భవతి', మీరు ఎలా చూస్తారో అదే కనపడుతుంది. దయ చేసి మీ దృష్టి కోణాన్ని మార్చుకోండని 'ఫణింద్ర' ఇనిస్టా వేదికగా చెప్పుకొచ్చాడు.