English | Telugu

ఖైదీ నంబర్‌ 6106.. దర్శన్‌ అభిమానులకు ఇది పద్మశ్రీ కంటే ఎక్కువా?

ఏదైనా తన దాకా వస్తేగానీ తెలీదంటారు. లోకంలో ఎవరికో ఏదో జరిగితే మనకెందుకు మనం బాగున్నాం, మనవాళ్ళు బాగున్నారు. ఈ ధోరణి సొసైటీలో ఎక్కువగా కనిపిస్తోంది. తన సినిమాలతో అందరికీ వినోదాన్ని అందించే హీరో తన అభిమానినే అతి కిరాతకంగా హత్య చేయడం, ఆ నేరారోపణపై అతనితో సహా 20 మందిని అరెస్ట్‌ చేయడం కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బెంగళూరు పరప్పన జైలులో ఉన్నాడు దర్శన్‌. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది. ప్రియురాలు పవిత్రగౌడతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిన దర్శన్‌ పట్ల అతని అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. రేణుకా స్వామి అనే అభిమానిని దర్శనే హత్య చేసాడని నిరూపించే పక్కా ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. దీంతో ఈ కేసు దర్శన్‌కు యమపాశంలా తయారైంది. ఈ కేసులో దర్శన్‌ ప్రధాన నిందితుడు అని స్పష్టంగా కనిపిస్తున్నా అతని ఫ్యాన్స్‌ మాత్రం తమ హీరోకి ఏ పాపమూ తెలీదు అన్న రేంజ్‌లో హడావిడి చేస్తున్నారు.

ఇటీవల దర్శన్‌ నటించిన పాత సినిమా ‘శాస్త్రి’(2005)ను రీ రిలీజ్‌ చేశారు. దీంతో అభిమానులు ఆ థియేటర్‌ దగ్గరకు వందల సంఖ్యలో చేరుకొని దర్శన్‌కు ఇచ్చిన ఖైదీ నెంబర్‌ 6106ని పెద్ద అక్షరాలతో బ్యానర్‌ చేయించి దాన్ని అదే హాలులో ప్రదర్శింపబడుతున్న ‘కల్కి’ పోస్టర్‌ మీదుగా వేలాడదీసి వికృతానందాన్ని ప్రదర్శించారు. ఆ నెంబర్‌ని పద్మశ్రీగా భావిస్తున్నారో ఏమో గానీ దానికి అంత బిల్డప్‌ ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. తమ హీరో తమతోటి అభిమానిని హత్య చేశాడనే బాధ లేకుండా అతన్ని సమర్థించడం హేయమైన చర్యగా కన్నడ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు హీరోలంటే వెర్రి అభిమానం ఉండేది. కర్ణాటకలో ఇప్పటికీ ఆ పిచ్చి కొనసాగడం అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది. ఆ పిచ్చి అభిమానం ఎంత తారాస్థాయికి చేరిందంటే కొందరు అభిమానులు 6106 అనే నంబర్‌ వున్న టీ షర్టులను వేసుకొని తిరుగుతున్నారు. ఇంతకంటే దారుణమైన చర్య మరొకటి ఉండదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.