English | Telugu

2022 ఫ‌స్టాఫ్ రివ్యూ5: స‌క్సెస్ కి బ్రేక్ ప‌డింది!

2022 ప్ర‌థ‌మార్ధం కొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌ను డిజ‌ప్పాయింట్ చేసింది. మ‌రీముఖ్యంగా.. విజ‌యాల్లో ఉన్న వారిని ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ ఫ‌స్టాఫ్ నిరాశ‌ప‌రిచింది. ఆ వివ‌రాల్లోకి వెళితే..

ర‌వితేజః

నిరుడు `క్రాక్`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లో వ‌చ్చిన క‌థానాయ‌కుడు ర‌వితేజ‌కి.. ఈ సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్ధం అంత‌గా అనుకూలించ‌లేదు. ఆయ‌న టైటిల్ రోల్ లో న‌టించగా ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌లైన‌ `ఖిలాడి` బాక్సాఫీస్ ముంగిట బోల్తా ప‌డ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. కాగా, సెకండాఫ్ లో `రామారావు ఆన్ డ్యూటీ`, `ధ‌మాకా`, `రావ‌ణాసుర‌` చిత్రాల‌తో ప‌ల‌క‌రించబోతున్నారు ఈ టాలెంటెడ్ స్టార్. ఇక `రాక్ష‌సుడు` వంటి విజ‌యవంత‌మైన చిత్రం త‌రువాత ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ‌కి కూడా `ఖిలాడి` ఫ‌లితం నిరాశ‌జ‌న‌క‌మే.

ర‌ష్మికా మంద‌న్నః

`స‌రిలేరు నీకెవ్వ‌రు`, `భీష్మ‌`, `పుష్ప - ద రైజ్` వంటి విజ‌యాల‌తో తెలుగునాట‌ మంచి ఊపులో ఉన్న ర‌ష్మికా మంద‌న్న‌కి.. మార్చి 4న విడుద‌లైన `ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు` డిజాస్ట‌ర్ ని క్రెడిట్ చేసింది. ఈ నేప‌థ్యంలో.. ఈ ఇయ‌ర్ సెకండాఫ్ లో రాబోతున్న `సీతా రామం`పైనే ఆశ‌లు పెట్టుకుంది ర‌ష్మిక‌. ఇందులో ఓ స్పెష‌ల్ రోల్ లో ఎంట‌ర్టైన్ చేయ‌నుంది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.

సూర్యః

`ఆకాశం నీ హ‌ద్దురా!`, `జై భీమ్`తో ఓటీటీ హిట్స్ అందుకోవ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన కోలీవుడ్ స్టార్ సూర్య‌కి.. `ఈటీ` రూపంలో చుక్కెదురైంది. మార్చి 10న `ఈటీ` జ‌నం ముందు నిలిచింది. కాగా, 2022 ఫ‌స్టాఫ్ లోనే రిలీజైన సెన్సేషనల్ మూవీ `విక్ర‌మ్`లో సూర్య చేసిన స్పెష‌ల్ రోల్ టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అయింది.

పూజా హెగ్డేః

`అర‌వింద స‌మేత‌`, `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్`, `అల వైకుంఠ‌పుర‌ములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`తో ఐదు వ‌రుస విజ‌యాలు అందుకున్న పూజా హెగ్డేకి.. 2022 ఫ‌స్టాఫ్ లో రిలీజైన `రాధే శ్యామ్`, `బీస్ట్`, `ఆచార్య‌`తో డిజాస్ట‌ర్ హ్యాట్రిక్ ద‌క్కిన‌ట్ల‌య్యింది. అయితే, `ఎఫ్ 3`లో చేసిన స్పెష‌ల్ సాంగ్ త‌న‌కి కాస్త రిలీఫ్ ఇచ్చింది. కాగా, ప్ర‌స్తుతం పూజ చేతిలో `జ‌న గ‌ణ మ‌న‌`, `#SSMB 28` వంటి తెలుగు చిత్రాలున్నాయి. 2023లో ఇవి రిలీజ్ కానున్నాయి.

వ‌రుణ్ తేజ్ః

`ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్`తో జోష్ లో ఉన్న వ‌రుణ్ తేజ్ ని.. ఏప్రిల్ 8న వ‌చ్చిన `గ‌ని` డిజప్పాయింట్ చేసింది. అయితే, మే 27న సంద‌డి చేసిన `ఎఫ్ 3` ఊర‌ట‌నిచ్చింది.

చిరంజీవి - కొర‌టాల శివ - రామ్ చ‌ర‌ణ్ః

ఏప్రిల్ 29న రిలీజైన `ఆచార్య‌`.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్ లో ఒక‌టిగా నిలిచింది. `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి`తో వ‌రుస విజ‌యాల్లో ఉన్న చిరంజీవికి.. `మిర్చి`, `శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్`, `భ‌ర‌త్ అనే నేను`తో దూసుకుపోతున్న కొర‌టాల శివకి `ఆచార్య‌`తో తీవ్ర నిరాశ‌త‌ప్ప‌లేదు. మ‌రోవైపు.. `ఆర్ ఆర్ ఆర్`తో పాన్ - ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చ‌ర‌ణ్ కి `ఆచార్య‌`తో ఊహించ‌ని ఫ‌లితం ద‌క్కిన‌ట్ల‌య్యింది.

నాని - వివేక్ ఆత్రేయః

జూన్ 10న విడుద‌లైన `అంటే.. సుంద‌రానికీ!`.. అటు కథానాయకుడు నాని, ఇటు దర్శకుడు వివేక్ ఆత్రేయ‌ని డిజ‌ప్పాయింట్ చేసింది. `శ్యామ్ సింగ రాయ్`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చిన నానికి.. `బ్రోచేవారెవ‌రురా`తో క‌మ‌ర్షియ‌ల్ హిట్ చూసిన ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌కి `అంటే.. సుంద‌రానికీ!` నిరాశ మిగిల్చింది.

సాయి పల్లవి:

గత ఏడాది 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగ రాయ్'తో రెండు వరుస విజయాలు సాధించిన సాయి పల్లవికి.. ఈ జూన్ 17న విడుదలైన 'విరాట పర్వం' నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చినా కమర్షియల్ హిట్ దక్కలేదు.