English | Telugu
2015 రివ్యూ: టాలీవుడ్ తిరగేస్తే..ఎవరి రాతలు ఎలా?
Updated : Dec 29, 2015
2015 సంవత్సరం ముగింపుకొచ్చింది. ఈ సంవత్సరం తెలుగులో పెద్ద హిట్ లూ వచ్చాయి. అదే రేంజిలో ఫ్లాపులూ వచ్చాయి. అంచనాలతో వచ్చిన సినిమాలు బోల్తా కొట్టాయి. క్రేజ్ లేకుండా వచ్చినవి రికార్డులు బద్దలు కొట్టి అందరికీ షాక్ ఇచ్చాయి. మరింతకీ ఈ యేడాది ఎవరి రాతలు ఎలా మరి పోయాయో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియోలు ఓసారి చూడండి.
అసలే సినిమా వాళ్లకు సెంటిమెంట్లు జర జాస్తి. దానికి విరుద్ధంగా ఒక్క అడుగు కూడా వేయలేరు. అందులోనూ ఐరెన్ లెగ్గంటే... ప్లెగ్గులో వేలు పెట్టినంత భయం. ఫలానా కథానాయిక నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవుతున్నాయంటే ఐరెన్ లెగ్ ముద్ర వేసేస్తారు. అలా 2015 కొంతమంది హీరోయిన్లను ఐరెన్ లెగ్గులుగా మార్చింది.
ఈ యేడాది భారీ అంచనాలు పెట్టుకొచ్చిన సినిమాలు బాక్సాఫీసు ముందు బొక్కబోర్లా పడ్డాయి. కోట్లు దండుకొంటాయిలే అని ఆశల పల్లకి ఎక్కించి.. పెట్టుబడిలో సగం రాబట్టుకోవడానికి నానా తంటాలు పడ్డాయి. ఇటు అభిమానుల్నీ, అటు బయ్యర్లనూ పూర్తిగా నిరాశ పర్చి, భారీ నష్టాల్ని మిగిల్చిన డిజాస్టర్లను ఓసారి పరిశీస్తే...
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో లాజిక్‌కి అందని విషయాల్లో బోలెడుంటాయి. వాటికి కనీసం సదరు దర్శకుడు కూడా సమాధానం చెప్పలేడు. సినిమా వస్తుంది.. వెళ్లిపోతుంది.. ఆ ప్రశ్న కూడా మరుగున పడిపోతుంది. 2015లో అలాంటి డౌట్లు ప్రేక్షకులకు చాలా వచ్చాయి. వాటికి ఇప్పుడైనా సమాధానం దొరుకుతుందేమో చూద్దాం. మరింతకీ ఈ యేడాది భేతాళ ప్రశ్నలుగా మిగిలిపోయినవేంటి? చూద్దాం.. రండి