English | Telugu
ఐటెమ్ గాళ్ ఆఫ్ ది ఇయర్ @ 2015
Updated : Dec 29, 2015
ఈ యేడాది టాలీవుడ్‌కి ఎంతో మంది భామలు దిగుమతి అయ్యారు. కొంతమంది ఒక సినిమాకే తట్టాబుట్టా సర్దేశారు. ఇంకొంతమంది కాస్తో కూస్తో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఐటెమ్ గాళ్స్ అయితే సినిమాకొకరి చెప్పున మారుతూనే ఉన్నారు. ఒక సినిమాలో కనిపించిన ఐటెమ్ గాళ్ మరో సినిమాకి ఉండడం లేదు. అయితే... 2015 మొత్తం ఓ ఐటెమ్ గాళ్ హవా చూపించేసింది.
దుమ్మురేపే స్టెప్పులతో అదరగొట్టింది... కుర్రాళ్ల హాట్ బీట్ పెంచేసింది. ఆ అమ్మాయే... నోరా ఫతేరీ. 2015లో ఏకంగా ఐదు సినిమాల్లో ప్రత్యేక గీతాలతో అలరించింది. ఈ కెనడా భామని పూరి జగన్నాథ్ వెదికి మరీ పట్టుకొచ్చాడు. ఆయనే తన లోఫర్ సినిమాలోనూ ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చాడు. బాహుబలిలోని ఓ గీతంలోనూ మెరిసిందీ ముద్దు గుమ్మ. కిక్ 2లో అలరించింది. షేర్‌లోనూ విజృంభించి స్టెప్పులేసింది. మొత్తానికి 2015లో ఐటెమ్ గాళ్ ఆఫ్ ది ఇయర్ అనిపించుకొంది.
అన్నట్టు.. ఈమె రేటు.. చీపే. పాటకు పది లక్షలిస్తే సరిపోతుందట. రెండ్రోజుల కాల్షీట్లలో పాట ఫినిష్ చేస్తుందట ఈ హాట్ భామ. అందుకే... నోరా అంటే.. అంత క్రేజు. నేడో రేపో... యంగ్ ముమైత్ ఖాన్ అనే బిరుదు కట్టబెట్టేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.