English | Telugu
రుద్రమదేవి - టేబుల్ లాస్??
Updated : Jul 13, 2015
బాహుబలి కోసం రాజమౌళి ఎన్ని కలలు కన్నాడో... రుద్రమదేవి కోసం గుణశేఖర్ కూడా అన్నే కలలు కన్నాడు. బాహుబలి - రుద్రమదేవి... రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే. అయితే... బాహుబలికి వచ్చిన క్రేజ్‌లో పది శాతం కూడా రుద్రమదేవికి రాలేదు. రాజమౌళి తన మాస్టర్ ప్లాన్‌తో ఈ సినిమాకి పైసా ఖర్చు పెట్టకుండా బీభత్సమైన పబ్లిసిటీ చేసి - విపరీతమూన హైప్ క్రియేట్ చేయగలిగాడు. అయితే గుణశేఖర్ మాత్రం ఈ విషయంలో క్రియేటీవ్ గా ఆలోచించలేకపోయాడు.
రుద్రమదేవి తొలి ట్రైలర్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో రుద్రమదేవి వైపు బయ్యర్లు తొంగి చూడలేదు. బాహుబలి కంటే ముందే రుద్రమదేవిని విడుదల చేయాలనుకొన్నాడు గుణ. కానీ.. అదీ సాధ్యం కాలేదు. ఇప్పడు బాహుబలి వచ్చేసింది. రుద్రమదేవికి విముక్తి కలగడానికి ఇదే సరైన సమయం. అందుకే ఆగమేఘాలమీద రుద్రమదేవిని బయటకు తీసుకొద్దామనుకొంటున్నాడు గుణ. ఈ సినిమాకి ఇప్పటి వరకూ రూ.65 కోట్ల బడ్జెట్ అయ్యిందని టాక్. ఏ సినిమా అయినా నిర్మాత టేబుల్ ప్రాఫిట్‌తో అమ్ముకోవాలని చూస్తాడు. కానీ ఈ సినిమా మాత్రం గుణశేఖర్ కనీసం రూ.20 కోట్ల డేబుల్ లాస్‌తో రిలీజ్ చేస్తున్నాడట.
ఇప్పటికైనా ఈ సినిమాని విడుదల చేస్తే అదే పది వేలు అనుకొంటున్నాడట. పెరిగిపోతున్న వడ్డీలు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే.. ఈ సినిమాని రూ.20 కోట్ల నష్టంతో రిలీజ్ చేయడం కంటే మరో మార్గం లేదని భావిస్తున్నాడు గుణశేఖర్. ఈనెల చివరి వారంలోగానీ, ఆగస్టు తొలి వారంలోగానీ రుద్రమదేవి వచ్చేసే ఛాన్స్ ఉందని టాక్. గుణశేఖర్ కలల చిత్రం.. కనీవినీ ఎరుగని విజయం సాధించి గుణ శేఖర్‌కి ఉపశమనం తీసుకురావాలని కోరుకొందాం.