English | Telugu
స్థానిక ఫలితాలు తారుమారైతే వేటు తప్పదు
Updated : Mar 4, 2020
గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదే!
మంత్రివర్గ సమావేశంలో హెచ్చరించిన సి.ఎం.
స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ సీరియస్ గా చర్చించింది. అన్ని స్థానాలను గెలిపించాల్సిన బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలదే అన్నారు సీఎం జగన్. ఫలితాలు తారుమారైతే మంత్రిపదవులు ఊడటం ఖాయమని. సహకరించని ఎమ్మెల్యేలకు మరో సారి సీటు దక్కదని హెచ్చరించారు.
నియోజకర్గాల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులకు వెంటనే రాజీనామా చేయాల్సివుంటుందని మంత్రులకు టార్గెట్‌లను ఇచ్చారు. అన్ని స్థానాలను వైసీపీ దక్కించుకునేలా కృషి చేయాలని మంత్రులను ఆదేశించారు.