English | Telugu

విజయవాడలోనూ కరోనా వైరస్?

బెజవాడకు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ యువకుడుని నగరంలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్‌ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు ఇటీవల జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, జలుబు ఉండడంతో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నిర్ధారణ కోసం శాంపిల్స్‌ని తిరుపతికి పంపించే ఆలోచన చేస్తున్నారు.

మ‌న దేశంలో ఇప్పటివరకు 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అధికారిక ప్రకటన చేశారు. 12మంది భారతీయులు 16మంది విదేశీయులకు కరోనా సోకిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 3500 పైచిలుకు మంది మృతి చెందారు.