English | Telugu
డాక్టర్ సునీత, సీబీఐ అధికారి రాంసింగ్ లపై కేసులు క్వాష్ చేస్తాం.. సుప్రీం
Updated : Aug 19, 2025
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ నుసుప్రీంకోర్టు మంగళవారం(ఆగస్టు 19)) విచారణ జరిపింది. జస్టిస్ సుందరేశ్, జస్టిస్ సింగ్ లతో కూడిన ధర్మాసనం వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందన్న లూథ్రా వివేకా హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వివేకా హత్య సూత్రధారులు తెలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వివేకా హత్య కేసు నిందితులు సాక్ష్యులను బెదిరించడమే కాకుండా.. సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న లూథ్రా, వివేకా కుమార్తె డాక్టర్ సునీత దంపతులతోపాటు సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పైనా కేసు పెట్టారని సుప్రీంకు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు వారిపై కేసులను క్వాష్ చేస్తామని పేర్కొంది. లూథ్రా తన వాదనలు కొనసాగిస్తూ.. వివేకా హత్య కేసులో మాస్టర్ మైండ్ కడప ఎంపీ అవినాష్ రెడ్డే అని చెప్పారు.