English | Telugu
బీహార్ లో లోకేష్ ఎన్నికల ప్రచారం
Updated : Nov 8, 2025
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయ్యింది. ఈ నెల 11 రెండవ చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. ఇందు కోసం ఆయన శనివారం (నవంబర్ 8) పట్నాకు వెళ్లారు. ఆయన బీహార్ లో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఎన్డీఏకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన బీహార్ ఎన్నికల్లో మిత్ర పక్షాల నేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ బీహార్ లో ప్రచారం చేయనున్నారు. ఎన్డీయేలో నిర్ణాయక శక్తిగా ఉన్న తెలుగుదేశం ఎన్డీఏ విజయం కోసం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు ప్రచారం చేసిన సంగతి విదితమే.
ఇప్పుడు బీహార్ లో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు కాకుండా లోకేష్ వెడుతున్నారు. కాగా బీహార్ ఎన్నికల ప్రచారం కోసం రెండు రోజుల పాటు ఆ రాష్ట్రనంలో పర్యటించనున్న లోకేష్ పనిలో పనిగా పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. అలాగే పట్నాలో చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో కూడా పాల్గొంటారు. శనివారం సాయంత్రం ఈ భేటీలు జరగనున్నాయి. ఆ తరువాత ఆదివారం (నవంబర్ 9) పాట్నా లో ఎన్డీఏ కు మద్దతు గా మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడతారు. అదే రోజు మధ్యాహ్నం పాట్నా నుండి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.