కడప జిల్లా వ్యాప్తంగా 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో కరోనా వైరస్ నుండి పూర్తిగా 13 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. కానీ, ఒక కల్యాణ మండపం లో దాచిపెట్టిన ఆ 30 మంది గురించి మాత్రం వారు నోరు మెదపటం లేదు. గత 17 రోజులుగా కోవిద్ హాస్పిటల్ లో చికిత్స పొందిన 13 మంది కి వైద్యులు పలు మార్లు పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ రావడంతో కోవిద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాఋ. డిశ్చార్ అయిన13 మందికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పౌష్టిక ఆహార సామగ్రిని పంపిణీ చేశారు. 13 మందికి నెగెటివ్ రిపోర్ట్ రావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. దీంతో36 నుండి 23 కు పాజిటివ్ కేసులు తగ్గినట్టయింది.