English | Telugu
ఎల్ జీ గ్యాస్ లీక్ కి కారణం మానవ తప్పిదమే! ఫోరెన్సిక్
Updated : May 12, 2020
సెల్ఫ్ పాలిమరైజేషన్ ని నివారించేందుకు స్టెరీన్ గ్యాస్ ని టెర్షియరీ బ్యుటైల్ కెటిచాల్ అనే కెమికల్లో కలపాల్సి ఉందని, కానీ లాక్ డౌన్ కాలంలో ఇలా జరగలేదని వివరించారు. సెల్ఫ్ పాలిమరైజేషన్ క్రమంగా మొదలై.. కెమికల్ రియాక్షన్ కి దారి తీసింది..దీంతో 150 డిగ్రీల సెంటీగ్రేడ్ తో అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడింది అని ఈ నివేదిక తెలిపింది.
దీనిని వెరిఫై చేయడానికి కంట్రోల్ రూమ్ లో ఒక ఆపరేటర్ ఉండాలని, తాము సైట్ ని పరిశీలించిన రోజున స్టోరేజీ ట్యాంక్ లో టెంపరేచర్ 120 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్టు ఈ బృందం పేర్కొంది. కూలింగ్ ప్రాసెస్ ని కూడా సరిగా నిర్వహించలేదని డాక్టర్ సరీన్ తెలిపారు.