English | Telugu
అందుకే ట్విట్టర్ లో పోస్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి విజయసాయి రెడ్డి గారూ....
Updated : Mar 12, 2020
పేరెన్నిక గన్న ఆడిటర్ గారు తప్పులో కలిశారా.... వై ఎస్ ఆర్ సి పి లో నెంబర్ 2, జగన్ మోహన్ రెడ్డి అంతరాత్మ అయిన విజయసాయి రెడ్డి ఎందుకిలా దొరికిపోయారు? జె సి దివాకర్ రెడ్డి కి ఝలక్ ఇచ్చే క్రమంలో ఆయనే షాక్ తినాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడింది? ప్రస్తుతం సాయి రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది ఇదే విషయంలో... 1996 లోనే చంద్రబాబు నాయుడు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు 500 నోట్ల రూపాయలను పంచారంటూ ఆయన చేసిన పంచ్ ట్వీట్ కు గట్టి జవాబే వచ్చింది. వాస్తవానికి ఇది కిందటి సంవత్సరం ఏప్రిల్ 24 ట్వీట్ అయినప్పటికి, ఇప్పుడది సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇదే విషయమై విజయసాయి రెడ్డి ని ప్రశ్నిస్తూ... ఒక ట్విట్టర్ ఖాతాదారుడు .." 1997 లో 500 నోట్లు ముద్రిస్తే, 1996 లో ఎలా పంచుతారు సాయిరెడ్డి గారూ.. కనీస అవగాహన లేకుండా ఎందుకిలా ఆడిటర్ గారూ.." అంటూ వేసిన సెటైర్ ఇప్పుడు సోషల్ మీడియా లో షికారు చేస్తోంది. అంటే సాయి రెడ్డి గారు, జగన్ కన్నా ముందే రివర్స్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారన్నమాట అనే మాటలూ వినపడుతున్నాయి. నిజానికి ట్విట్టర్ వాడకం లో విజయసాయి రెడ్డి చాలా ముందుంటారు.. కానీ, ఆయన ట్విట్టర్ హ్యాండ్లర్ ఎవరో తెలీక చేసిన వ్యవహారానికి ఇవాళ, నెటిజెన్ల నుంచి ప్రశ్న పరంపర ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ విషయాలు ఇలా ఉంటె, తెనుగు దేశం అధినేతపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మళ్ళీ విరుచుకు పడ్డారు. " ఎలక్షన్లలో మందు, డబ్బు పంపిణీ చెయ్యనీయకుండా ఆపటానికి మీరెవరని టీడీపీ ప్రశ్నిస్తోంది. వీటిని అడ్డుకునే ఆర్డినెన్సు చెల్లదట. కోర్టుకెళ్లైనా మందు పంచిపెట్టడానికి అనుమతి సాధిస్తామని సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నారు. అడ్రసు గల్లంతయ్యే ముందు ఇలాంటి పిచ్చి ఐడియాలే వస్తాయి" అంటూ ఆయన చేసిన తాజా ట్వీట్ నిజానికి టీ డీ పీ ని డిఫెన్స్ లో పడేసింది. అయితే, ఒక ఔత్సాహిక తెలుగుదేశం కార్యకర్త మాత్రం సాయిరెడ్డి కి భలే పసందైన రిప్లై ఇచ్చాడు.. " గ్రామ వాలంటీర్స్ బాగానే స్టాక్ పెట్టారు.. ఓటుకి వెయ్యి రెండూ గోల్డెన్ ఆంధ్రప్రదేశ్ సీసాలు, ఆడోళ్లకి చీరలు బానే పంచుతున్నారు వైసీపీ వాళ్ళు. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి ఏవో గుడిసెలు అని.. వైసీపీ చేసేది కూడా అదే.. అసలు మీరు గెలిచిందే మద్యం, డబ్బు పంచిబెట్టే కదా," అంటూ ఆ తెలుగుదేశం అభిమాని ఇచ్చిన బదులుతో ఇప్పుడు వై ఎస్ ఆర్ సి పి కౌంటర్ వేయడానికి దారి వెతుక్కుంటోంది. అయినా విజయ్ సాయి రెడ్డి గారూ..మీరు లెక్కల్లో చాలా జాగ్రత్త గాఉంటారు కాదాసర్... ఎందుకలా, గభాల్న 1997 అనేశారు.. !!