English | Telugu

నా పేరు చెబితే క్రిమినల్ కేసులు పెట్టండి... విశాఖలో సెంటు భూమి లేదన్న విజయసాయి

విశాఖలో తనకు ఒక్క సెంటు భూమి కూడా లేదన్నారు విజయసాయిరెడ్డి. భూదందాల్లో తనపై వస్తున్న ఆరోపణలను వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. భూ సెటిల్మెంట్లతో తనకు సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విశాఖలో తనకు త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తప్పా... పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ మరెలాంటి ఆస్తులు లేవన్నారు. ఏ వెంచర్ లోనూ భాగస్వామ్యం లేదని తేల్చిచెప్పారు. భూముల విషయంలో ఎలాంటి పైరవీలు చేయలేదని, ఏ అధికారితోనూ మాట్లాడలేదని విజయసాయి స్పష్టత ఇచ్చారు. విశాఖలో భూదందాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ధర్నాలు చేశామని, భూఅక్రమాలకు పాల్పడిందెవరో తనకు తెలుసన్నారు. ఒకవేళ ఎవరైనా తన పేరు చెప్పుకుని భూదందాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులకు విజయసాయిరెడ్డి సూచించారు.