English | Telugu

ప్రకటనకు ఒక్కే రోజే మిగులుంది... విశాఖలో జగన్ కు గ్రాండ్ వెల్ కమ్

నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖను అధికారికంగా ప్రకటించనున్నారు. డిసెంబర్ 27న మంత్రివర్గ సమావేశం తర్వాత రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖను అనౌన్స్ చేయనున్నారు. డిసెంబర్ 27న ప్రకటన అధికారిక ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 28న విశాఖలో పర్యటించనున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించిన తర్వాత తొలిసారి పర్యటించనున్న సీఎం జగన్ కు భారీ స్వాగత పలకనున్నట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. దాదాపు మూడు గంటలపాటు స్వాగత కార్యక్రమాలు ఉంటాయన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలుకుతామని విజయసాయిరెడ్డి తెలిపారు. సుమారు పాతిక కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి జగన్ కు గ్రాండ్ వెల్ కమ్ చెబుతామన్నారు విజయసాయి.