English | Telugu
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త: కార్గో పార్సిల్ పై దృష్టి పెట్టిన కేసీఆర్...
Updated : Dec 26, 2019
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు.ఎందరో వారి ప్రాణాలను సైతం కోల్పొయారు.సమ్మె విరమించిన అనంతరం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించారు.అం దులో భాగంగా ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని పెంచనున్నట్లు ప్రతిజ్ఞ చేశారు సీఎం కేసీఆర్.ఆయన ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మేరకు ఉత్తర్వుల పై సీఎం కేసీఆర్ సంతకం కూడా చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎం.
ఈ బోర్డ్ లో ప్రతి డిపో నుంచి ఇద్దరు ఉద్యోగుల చొప్పున మొత్తం 202 మంది సభ్యులుంటారు. ఇందులో 73 మంది మహిళా ఉద్యోగులు డిపో పరిధిలో వారానికోసారి, రీజియన్ పరిధిలో నెలకొసారి, కార్పొరేషన్ లో మూడు నెలలకొసారి సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలను మరింత విస్తృత పరచాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ ద్వారానే సరుకు రవాణా జరపాలన్నారు. ముంబై, సోలాపూర్, నాగపూర్, భీవండిలకు సరకు ఆర్టీసీ కార్గో ద్వారానే రవాణా చేయాలని సూచించారు. బతుకమ్మ చీరలు, పుస్తకాలూ మద్యం రవాణా కూడా ఆర్టీసీ కార్గోల ద్వారానే జరుగాలన్నారు కెసిఆర్.