English | Telugu

నీది పచ్చ స్వామి భక్తి.. కన్నా పై విరుచుకు పడ్డ విజయ్ సాయి రెడ్డి

వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ను కొంత కాలంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడు రాజధానుల బిల్లు పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కు కన్నా లేఖ రాయడం పై విజయసాయిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. "కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాశారు. దీనితో పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?" తాజాగా తన ట్వీట్ లో అయన విమర్శించారు.

అంతే కాకుండా "బాబుతో భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర బీజేపీకి జాతీయ నాయకత్వం హెచ్చరించినా టీడీపీ లైన్ లోనే లేఖలు రాస్తున్నారు. కరోనా టైంలోనైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఎలా కన్నా? బీజేపీ స్టేట్ ఇంచార్జి కూడా రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అన్నారుగా కన్నా. ఓహో ఇదంతా నీ పచ్చ స్వామి భక్తినా? " అంటూ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కన్నా లక్ష్మి నారాయణ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. అయితే కొద్ది రోజుల క్రితం ఇలాగే విజయ్ సాయి రెడ్డి కన్నా పై తీవ్ర వ్యాఖ్యలు చేయగా అటు ఢిల్లీ నుండి ఇటు ఎపి లో ఉన్న బీజేపీ లీడర్ల వరకు అందరు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఎంపీ విజయ్ సాయి రెడ్డి తాజా వ్యాఖ్యల పై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.