English | Telugu
సినీ నటి వాణిశ్రీ కుమారుడి మృతి పై అనుమానాలు
Updated : May 23, 2020
చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్న అభినయ్.. లాక్‌డౌన్ నేపథ్యంలో కొద్దిరోజులుగా ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఏవో సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ఆయన ముభావంగా ఉంటున్నారట. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు అభినయ్ మృతిపై తిరుక్కళుకుండ్రం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.