English | Telugu
సి.ఎం. పద్దతి మార్చుకో! లేకపోతే అసలుకే మోసపోతావు
Updated : Mar 15, 2020
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగానికి విరుద్దంగా ఉంటున్నాయంటూ హైకోర్టు నిత్యం హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోదంటారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, అధికా రుల వ్యవహార శైలి రాజ్యాంగ బద్ధంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించిందన్నారు. దశాబ్దాలుగా పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూము లు, అసైన్డ్ భూములను ఇళ్ళ పట్టాల పేరుతో అక్రమంగా లాక్కుంటున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించిన విషయాన్ని మరవరాదన్నారు. అమరావతిలో రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో 1250 ఎకరాలు ఇచ్చేలా జీవో జారీ చేయడం సీఆర్డీఏ చట్టానికి వ్యతిరేకమన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్య టనలో పోలీసుల వ్యవహరించిన తీరుపై డీజీపీ హైకోర్టుకు వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఎవరు చెప్పినా వినకుండా ప్రభుత్వ కార్యాలయాలకు రూ.130 కోట్లతో పార్టీ రంగులు వేశారని, న్యాయస్థానం సూచించినా ఇప్పటివరకు రంగు లు మార్చకపోవడానికి గల కారణమేమిటని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ పద్ధతి మార్చుకోవాలని వడ్డే సలహా ఇచ్చారు.