English | Telugu

అమెరికా వీసా ప్రాసెస్ బంద్‌!

అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా వైరస్ ధాటికి వణికిపోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఇండియాలోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్ అన్ని వీసా అప్పాయింట్ మెంట్లను ఈ నెల 16 వరకు రద్దు చేసింది. ఈ మేరకు యు.ఎస్ .ఎంబసీ ప్రకటన చేసింది. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఆ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు.

కరోనాను నిలువరించ‌డానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పుడా దేశం నడుం బిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారిని నిలువరించటం.. వారిపై వీసా ఆంక్షలు విధించటం చేస్తున్నారు. అంతేకాదు.. అమెరికాకు ప్రయాణాలు పెట్టుకున్న వారు తమ జర్నీని పోస్టుపోన్ చేసుకోవాలన్న సూచన చేస్తున్నారు.

అంతే కాదు తమ దేశంలోకి విదేశీయుల్ని అడుగు పెట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని అమెరికా కాన్సులేట్ లో సోమవారం నుంచి వీసాల జారీ కార్యక్రమాన్ని నిలుప వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇమ్మిగ్రెంట్.. నాన్ ఇమ్మింగ్రెండ్ వీసా అపాయింట్ మెంట్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి డేట్ వచ్చే వరకు వీసాల జారీ కార్యక్రమాల్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక పై ఎలాంటి వీసా సర్వీసులు ఉండవని చెబుతున్నారు. ఈ నేపథ్యం లో వీసా అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్ చేసుకోవాలన్న సూచన వినిపిస్తోంది. భారత్ లోని అన్ని అమెరికన్ కాన్సులేట్లకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ వీసాల మీద ఆశలు పెట్టుకున్న వారికి కరోనా భారీ షాకిచ్చినట్లే.

ఈ నేప‌థ్యంలో అమెరికాలోని ఇండియన్ స్టూడెంట్స్ త‌మ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని, అమెరికాలోని ఇండియన్ ఎంబసీ విజ్ఞ‌ప్తి చేసింది. అమెరికాలోని పలు విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో 2 లక్షలకు పైగా భారత విద్యార్ధులున్నారు. వైరస్ నివారణ, నియంత్రణల గురించి ఎంబసీ వెబ్ సైట్ ను చూడాలని కోరింది.