English | Telugu

జగన్ పార్టీ కూడా మాతో పొత్తుకు ప్రయత్నించింది:  నాదెండ్ల మనోహర్

ప్రతి కాలానికి జ్ఞానం ప్రబోధించటానికి బ్రహ్మం గారి లాంటి వారు ఒకరు పుడుతుంటారు. ఆ కోవలోకి చెందిన వ్యక్తే నాదెండ్ల మనోహర్. తండ్రి భాస్కర రావు గారి చల్లని నీడలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈయన, మేధావుల కోటాలో ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికై, చాలా బరువైన బాధ్యతలు నిర్వర్తించారు . తర్వాతి కాలం లో లింగమనేని రమేష్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ కు దగ్గరై జన సేన లో నెంబర్ 2 గా ఎదిగారు. చంద్రబాబు నాయుడు తో వైరుధ్యం ఉన్నపటికీ, దాన్ని శత్రుత్వం గా మలుచుకోవాలనే కోరిక ఈయనకు లేదు కాబట్టి, తెలుగు దేశానికి కూడా కావలసిన వ్యక్తిగా ఈయన జన సేన ను టీ డీ పీ -2 గా మలచటం లో కీలక భూమిక పోషించారు, సరిగ్గా, ఈ సమయం లోనే, పవన్ కళ్యాణ్ కు ఉన్న కన్ఫ్యూషన్ కి మరింత వాల్యూ ఎడిషన్ చేసిన మంచి టైమింగ్ ఉన్న నాయకుడు గా నాదెండ్ల మనోహర్ ఎదిగారు. ఆయన పుణ్యమా అని జన సేన ఆరంభం నుంచి ఉన్న కీలక నేతలందరూ , ఇతర పార్టీలకు సర్దుకున్నప్పటికీ .....పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన హవా మాత్రం 'కరోనా వైరస్ ' అంత వేగం గా వ్యాపిస్తోంది. రాజమండ్రి లో ఆయన జన సేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆయన చేసిన అనుగ్రహభాషణం లో దొర్లిన ఆణిముత్యాలు కొన్ని ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాం.

'గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడానికి కారణాలున్నాయి. ఈ విషయాన్ని మూడు నెలల నుంచి బహిరంగంగానే మాట్లాడుతున్నాం' అని చెప్పారు నాదెండ్ల మనోహర్. 'చాలా పార్టీలు వచ్చి మాతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశాయి. ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కూడా ప్రయత్నించింది. కానీ, ఆ రోజు మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. కచ్చితంగా యువత కోసం, ఒక తరానికి ఉపయోగపడేలా రాజకీయాలు చేయాలి తప్పా ఒక ఎన్నికల కోసం రాజకీయాలు చేయకూడదని కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు' అని నాదెండ్ల తెలిపారు.'ప్రత్యేకంగా కొందరు యువకులను ఎంపిక చేసి పోటీ చేయించారు. అటువంటి రాజకీయాలు చేస్తున్నాం. వేరే పార్టీల్లో ఏముంది చెప్పండి? మొదట 10 కోట్ల రూపాయలు డిపాజిట్‌ చేయమని అభ్యర్థులకు చెబుతున్నారు. అటువంటి వారు సమాజానికి ఉపయోగపడతారా?' అని ప్రశ్నించారు.

'ఏపీకి విభజన తర్వాత జరుగుతోన్న అన్యాయంపై పోరాడే వారు ఎక్కడున్నారు ఈ రాజకీయాల్లో? ఎక్కువ ప్రాధాన్యత యువతకే ఇద్దామని పవన్‌ కల్యాణ్ పదే పదే చెబుతారు. స్వార్థ రాజకీయాలు చేయొద్దనే సిద్ధాంతంలో ముందుకు వెళ్తున్నాం' అని చెప్పారు.