English | Telugu

అమెరికాలో నిరుద్యోగ తీవ్రత! 32.83 లక్షల మంది రోడ్డున‌ప‌డ్డారు!

అమెరికాను కరోనా వైరస్ ఆవహించింది. ఈ క్రమంలో కంపెనీలు పరిశ్రమలు వివిధ సంస్థలు మూతపడుతున్నాయి. ఇది అన్ని రంగాలపై ప్రభావం పడుతోంది. దీంతో మార్చి 21 వరకే ఏకంగా అమెరికాలో 32.83 లక్షల మంది రోడ్డున పడ్డ పరిస్థితి కనిపించింది. 32 లక్షల మంది జాబ్ ల కోసం క్లెయిమ్స్ పెట్టుకోవడం.. చేస్తామని అప్లికేషన్లు పెట్టుకోవడం అమెరికాలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది.

మార్చి 21నాటికి గడిచినవారంలో అమెరికాలో 3.28 మిలియన్స్ మంది అమెరికన్లు జాబ్ లెస్ క్లెయిమ్స్ పెట్టుకోవడంతో కరోనా కారణంగా అమెరికాలో ఎంతటి పెను విధ్వంసం చోటుచేసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కనుక మరింత ఎక్కువైతే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.