English | Telugu

ట్రంప్ ముంచేశాడు! మోడీ మ‌న‌ల్ని గట్టున పడేసారా!

మెరికా ఆసుపత్రులకు పోటెత్తు తున్న రోగులు! చేర్చుకోలేని స్థితి లో ఆసుపత్రులు! ఒక ventilator ను ఇద్దరికి వాడాలని నిర్ణయం! పూర్తిగా అలిసిపోయిన మెడికల్ సిబ్బంది! పరిస్థితి మరింత దిగ జారే ప్రమాదం! “ ఆసుపత్రికి వస్తున్న వారిలో అధిక శాతం ఆగ కుండా విపరీతంగా దగ్గుతున్నారు “ అని అమెరికా లోని డాక్టర్స్ చెబుతున్నారు. అమెరికా లో తట్టుకోలేని దగ్గు తో ఆయాస పడుతూ ఆసుపత్రికి వస్తున్నారు. బాధాకరమైన వాస్తవం !
మార్చి 18 నాటికి అమెరికా లో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆరు వేలు . ఇండియా లో 150. వారం తరువాత ఈ రోజుకి ఇది అమెరికా లో 85 వేలు అయ్యింది. ఇండియా లో 630. ట్రంప్ అమెరికా ను ముంచేశాడు ! మోడీ లాక్‌డౌన్ ప్ర‌క‌టించి ఇండియా ను గట్టున పడేసాడు. అందరూ ఇల్లు దాటకుండా ఉండాల్సిన అవసరాన్ని ఈ లెక్క‌లు చెబుతున్నాయి.

అమెరికా లో ఎక్కువ కరోనా కేసు లు బయట పడుతున్నాయి అంటే దానికి కారణం అక్కడ ఎక్కువ మందిని చెక్ చెయ్యడం! ఇండియా లో తక్కువ కేసు లు వున్నాయంటే అందుకు కారణం చాలా తక్కువ మందిని చెక్ చెయ్యడమే - ఇదొక వాదన / అభిప్రాయం !

అయితే వాస్త‌వం ఏమిటంటే చెక్ చేయడానికి చేయక పోవడానికి తేడా కేవలం వారం రోజులే. రోగం ముదిరితే పరుగెత్తుకొంటూ ఆసుపత్రికి వస్తారుగా? ఇంట్లో దుప్పట్లో దాక్కోలేరుగా? అమెరికా లో కేసు లు ఎనభై వేలు కు పైగా. ఇండియా లో 600. ఎక్కడ పోలిక ?

ఇండియా కరోనా మరణాలు కొన్ని సంభవించి ఉండొచ్చు! కానీ అమెరికా లో లాగ తీవ్ర మైన స్థితి కనబడం లేదు . మలేరియా ప్రాంత ప్రజల పై కరోనా మైల్డ్ గానే ప్రభావం చూపుతుంది . వృద్ధాప్యం, హై బీపీ , శ్వాస కోస వ్యాధులు వున్నప్పుడే ఇండియా లాంటి ఉష్ణ మండల మలేరియా ప్రాంత వాసుల విషయం లో అది ప్రాణాంతకంగా మారుతుంది.