English | Telugu
మెగా ఫ్యామిలీలో విషాదం.. ఉపాసన తాతయ్య కన్నుమూత
Updated : May 27, 2020
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దోమకొండలో జన్మించిన ఉమాపతి రావు ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేశారు. ఆయన మృతికి ఉపాసన ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘మా తాతయ్య కె.ఉమాపతి రావు(జూన్ 15,1928- మే 27, 2020) గొప్ప విలువలు, నిస్వార్థం, మానవత్వం గల వ్యక్తి. ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే. ఉర్దూలో ఆయన రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాతయ్య’ అంటూ ఉపాసన భావోద్వేగ ట్వీట్ చేశారు.